కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్.. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సమీక్ష

by Shiva |
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్.. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీ (Miss World Pageants)లను కాంగ్రెస్ సర్కార్ (Congress Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బంజారా హిల్స్‌ (Banja Hills)లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌ (Control Command Center)లో ఉదయం 11.30కి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం (Tourism), సంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా వారికి సలహాలు, సూచనలు చేయనున్నారు. అందాల పోటీల్లో పాల్గొనే వారు సందర్శించబోయే పర్యటక ప్రదేశాల (Tourist Attractions)పై ఆరా తీయనున్నారు. చౌమెహల్లా ప్యాలెస్, రామప్ప, యాదాద్రి, నాగార్జున సాగర్, భూదాన్ పోచంపల్లిలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

కాగా, మిస్ వరల్డ్ పోటీ (Miss World Pageants)ల్లో భాగంగా అతిథులకు మే 6, 7న సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికేందుకు తెలంగాణ టూరిజం శాఖ (Telangana Tourism Department) ఏర్పాట్లు చేస్తోంది. ఓపెనింగ్ సెర్మనీ (Opening Ceremony) మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. మే 12న నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar)లోని కృష్ణా నది తీరంలో ఉన్న బుద్ధ వనాన్ని పోటీదారులు సందర్శిస్తారు. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 15న విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు పేరుగాంచిన భూదాన్ పోచంపల్లి (Bhudan Pochampally)కి వెళ్లనున్నారు. అక్కడ ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం, ప్రత్యేకతలను అధికారులు వారికి వవరించనున్నారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి సంబంధించిన హస్త కళలైన సిద్దిపేట, చేర్యాల బొమ్మలపై పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, వంటి కళాకృతులను స్టాళ్లలో ప్రదర్శించనున్నారు.



Next Story