Selena Gomez : నేను పిల్లల్ని కనలేను.. ఎవరినైనా దత్తత తీసుకుంటా..

by Prasanna |   ( Updated:2024-09-11 14:44:00.0  )
Selena Gomez : నేను పిల్లల్ని కనలేను.. ఎవరినైనా దత్తత తీసుకుంటా..
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికన్ స్టార్ పాప్ సింగర్ సెలీనా గోమెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను మెప్పించింది. అమెరికాలోనే కాకుండా వరల్డ్ వైడ్ కూడా స్టార్ సింగర్ సెలీనా గోమెజ్. స్టార్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తో కొంత కాలం రిలేషన్ షిప్ నడిపి బ్రేకప్ కూడా అయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆమె హెల్త్ ప్రొబ్లెమ్స్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది.

సెలీనా గోమెజ్ మాట్లాడుతూ.. నేను ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నేను అసలు పిల్లల్ని కనలేను. దాని వల్ల నాకు, నాకు పుట్టబోయే బిడ్డకు కూడా చాలా ప్రమాదం. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఎవరినైనా దత్తత తీసుకుంటా.. అని చెబుతూ ఎమోషనల్ అయింది. అయితే ఆమె సమస్య ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దీంతో సెలీనా గోమెజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Advertisement

Next Story