Siraj : సిరాజ్ వైఫల్యం.. టీం మేనేజ్‌మెంట్‌కు సునీల్ గవాస్కర్ కీలక సూచన

by Sathputhe Rajesh |
Siraj : సిరాజ్ వైఫల్యం.. టీం మేనేజ్‌మెంట్‌కు సునీల్ గవాస్కర్ కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : మహమ్మద్‌ సిరాజ్‌ను టీం మేనేజ్‌మెంట్ వెంటనే తప్పించాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన శుక్రవారం ఈ మేరకు మాట్లాడారు. ‘సిరాజ్‌కు కొత విశ్రాంతి అవసరం. విశ్రాంతి అంటే.. ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వనందుకు తప్పిస్తున్నామని అతనికి చెప్పాలి. నేరుగా అతని ముఖం పట్టుకుని పర్ఫామెన్స్ సరిగా లేకపోవడంతో తప్పిస్తున్నట్లు చెప్పాలి. విశ్రాంతి తీసుకోవాలని చెబితే వారు ఆటలలో మరింతగా రాణించలేరు. పిచ్‌లు సహకరిస్తున్నా.. నువ్వు రాణించడం లేదని సిరాజ్‌కు చెప్పాలి. జట్టులో రెండు మార్పులు చేయాల్సి ఉంటే ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానాలను బుమ్రాకు మద్దతుగా తీసుకోవాలి.’ అని గవాస్కర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సిరాజ్ 23 ఓవర్లు వేసి 5.30 రన్ రేట్‌తో 122 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు టెస్ట్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed