ఆరెగూడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

by Sridhar Babu |
ఆరెగూడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, కాగజ్నగర్ రూరల్ : ఆరెగూడ గ్రామ సమీపంలోని కడంబ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దాంతో గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. ప్రమాదాలు నివారించడానికి పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, పొలాల్లో పనిచేసేవారు సాయంత్రం 4 గంటల లోపు ఇంటికి చేరుకోవాలని, ఏదైనా పులి సంచారం గుర్తిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని, పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story