- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి ?

దిశ, ఎల్లారెడ్డిపేట : ఓ ఆర్ఎంపీ వైద్యానికి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలంలో తురకాశి పల్లెలో చోటుచేసుకుంది. తురకాశి పల్లెకు చెందిన షేక్ కాశింబీ (35) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కాగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యునికి చూపించారు. అతను రెండు రోజుల పాటు వచ్చీరాని వైద్యం చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు గత రాత్రి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కాగా మహిళా మృతికి కారణమైన సదరు ఆర్ఎంపీ వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన పై స్థానిక ఎల్లారెడ్డి పేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ విచారణ చేపట్టినట్లు సమాచారం.