- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్త పరీక్ష కిట్ల కొరత.. ఇబ్బందులు పడుతున్న రోగులు..
ఐదు నియోజకవర్గాలకు పెద్ద దిక్కుగా ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రక్త పరీక్ష కిట్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. గత ప్రభుత్వం రక్త పరీక్షలకు రోగులు బయటకు పోవద్దని ఉద్దేశంతో దాదాపు 50 నుంచి 57 రకాల రక్త పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో టీ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్ ప్రారంభమైన కొన్ని నెలలు సజావుగానే రక్తపరీక్షలు నిర్వహించినా ఇటీవల కాలంలో ఆ సదుపాయం దశల వారీగా తగ్గుతూ వస్తున్నట్లుగా రోగులు చెబుతున్నారు. ముఖ్యమైన రక్త పరీక్షలకు సంబంధించిన కిట్ల కొరత ఉందని, పరీక్షల కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్ష కిట్ల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తున్నది. గతంలో రక్త పరీక్ష జరిగిన వెంటనే గంటలోపే రిపోర్టు వచ్చేదని.. ఇటీవల కాలంలో రక్త పరీక్ష రిపోర్ట్‌ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
దిశ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రక్త పరీక్ష కిట్ల కొరత వేధిస్తున్నది. గత పాలకుల హయాంలో ఇలాంటి రక్త పరీక్షలకు బయటకు పోవద్దని ఉద్దేశంతో దాదాపు 50 నుంచి 57 రకాల రక్త పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో "టీ హబ్" ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హబ్ ప్రారంభమైన నాటి నుంచి కొన్ని నెలల పాటు అన్ని రకాల రక్త పరీక్షల నిర్వహణ సజావుగా కొనసాగినా.. ఇటీవల కాలంలో ఆ సదుపాయం దశల వారీగా తగ్గుతూ వస్తున్నట్లుగా కొంత మంది రోగులతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యమైన రక్త పరీక్షలకు సంబంధించిన కిట్ల కొరత ఉందని పరీక్షల కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పలువురు రోగులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇతర వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్ష కిట్ల కొరత ఉందని ఈ సమస్య కొంతమంది ప్రజాసంఘాల నాయకుల దృష్టికి తీసుకువెళ్లారని ప్రజలు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్ద ఆస్పత్రికి ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల నుంచి అనేక మంది ప్రజలు వైద్య సేవలకు వస్తుంటారు. ఎవరైనా పాము కాటకు, యాక్సిడెంట్లకు గురైన వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి ప్రభుత్వ వైద్యులు రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో రక్త పరీక్షలకు సంబంధించిన కిట్ల కొరత ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సకాలంలో రిపోర్టులు రావడం లేదు..
భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకుంటే సకాలంలో రిపోర్టులు రావడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రక్త పరీక్ష జరిగిన వెంటనే గంటలోపే రిపోర్టు వచ్చేదని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో రక్త పరీక్ష రిపోర్ట్‌ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని కొంతమంది రోగులతో పాటు సహాయకులు ఆరోపించడం గమనార్హం.
కిట్ల కోసం ఇండెంట్ పెట్టాం.. రాజ్ కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్..
రక్త పరీక్షలకు సంబంధించిన కిట్లు అయిపోయిన వెంటనే వాటి కోసం ఇండెంట్ పెడతాం. కిట్లు రావడంలో కొంత ఆలస్యం జరగడంతో సమస్య ఏర్పడుతోంది. రక్త పరీక్ష కిట్ల కొరత నివారణకు చర్యలు తీసుకుంటాం.
రక్త పరీక్షల కిట్ల కొరత లేకుండా చూడాలి.. సీపీఎం సీనియర్ నాయకుడు భూక్య రమేశ్..
ధర్మాస్పత్రిలో రక్తపరీక్ష నిర్వహించే టీ హబ్‌లో రక్త పరీక్ష కిట్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇటీవల ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టాం. ఐదు నియోజకవర్గాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో మందులతో పాటు రక్త పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచాలి. రక్తపరీక్ష రిపోర్ట్‌లు సకాలంలో ఇవ్వాలని అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం.