- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: పేదల వైద్యం పట్ల పట్టింపు లేకపోవడం దారుణం.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: పేద ప్రజల వైద్యంపట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దారుణమని మల్కాజ్‌గిరి(Malkaj giri) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajendar) అన్నారు. అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిని(Alwal Government Hospital) సందర్శించిన ఆయన.. ప్రభుత్వం(Congress Government)పై విమర్శలు(Critisized) చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్(Primary Health Centre) పేదలకు మంచి వైద్యం అందించేదని అన్నారు. అలాగే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా.. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అని భావిస్తే.. బిల్డింగ్ పూర్తి చేసిన కాంట్రాక్టర్ కి డబ్బులు రాలేదని తాళాలు వేసుకోవడంతో కొన్ని నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు. రాజకీయ పట్టింపులు, కాంట్రాక్టు బిల్లులు రాకపోవడం, పేద ప్రజల వైద్యంపట్ల పట్టింపు లేకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈరోజే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి(Haelth Minister)తో మాట్లాడి దీనిని వెంటనే ప్రారంభోత్సవం చేసే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. స్టాఫ్‌ను సంపూర్ణంగా నియమించి, వైద్య పరికరాలు తెప్పించి, పేద ప్రజానీకానికి వైద్యం అందేలా చూస్తానని ఈటల భరోసా కల్పించారు.