దళం నుండి జన స్రవంతిలో కలిసి ఆనందమైన జీవితం గడపాలి : డీఎస్పీ రాములు

by Aamani |
దళం నుండి జన స్రవంతిలో కలిసి ఆనందమైన జీవితం గడపాలి : డీఎస్పీ రాములు
X

దిశ, కోరుట్ల: గత కొద్ది సంవత్సరాలుగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దళంలో చేరాగ వారి కుటుంబ సభ్యులను మెట్ పల్లి డీఎస్పీ ఏ రాములు కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అంబేద్కర్ కాలనీ చెందిన తిప్పిరి తిరుపతి అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం దళం లో చేరాడు. ఆదివారం తిరుపతి కుటుంబ సభ్యులను మెట్ పల్లి డీఎస్పీ ఏ రాములు తన సిబ్బందితో కలసి తిరుపతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం తిరుపతి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి దళంలో చేరిన తిరుపతి జన స్రవంతిలో కలిసి ఆనందమైన జీవితాన్ని గడపాలని కోరుతున్నామని మెట్ పల్లి డీఎస్పీ ఏ రాములు అన్నారు.ఆయన వెంట కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story