Deepika Padukone: ‘కల్కి-2’ ఫస్ట్ ప్రయారిటీ కాదు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
Deepika Padukone: ‘కల్కి-2’ ఫస్ట్ ప్రయారిటీ కాదు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) చివరగా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898 AD) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కల్కి-2’ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల అయిన విషయం తెలిసిందే.

అయితే కల్కి తర్వాత దీపికా పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీకి దూరం అయింది. తన కూతురిని చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా ‘కల్కి-2’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను కూడా ‘కల్కి-2’ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ అది నా ఫస్ట్ ప్రయారిటీ కాదు. నా కుమార్తె దువా(Dua Singh). ముఖ్యంగా నా కూతురిని పెంచడం కోసం నేను ఆయాను నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మ అన్ని పనులు వదులుకొని ఎలా అయితే దగ్గరుండి చూసుకుందో అలా నా కూతుర్ని పెంచాలని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా కామెంట్స్ ప్రభాస్ అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు ‘కల్కి-2’ లో నటిస్తుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed