- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రదాడికి ముందు రెక్కీ.. ఆ చిన్నారి డ్యాన్స్ వీడియోలో ఏం కనిపించిందంటే?

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిపై NIA అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడి దర్యాప్తులో టూరిస్టుల వీడియోలు కీలకంగా మారాయి. వీడియోల్లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాడికి ముందు రెక్కీ నిర్వహించినట్లు నిర్ధారించారు. NIA అధికారులకు మహారాష్ట్రకు చెందిన టూరిస్ట్ శ్రీజిత్(Tourist Sreejith) కీలక వివరాలు అందించారు. తన కుమార్తె డ్యాన్స్ చేస్తున్న వీడియోలో కాల్పులు జరిపిన ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని స్థానిక అధికారుల ద్వారా NIA దృష్టికి తీసుకెళ్లారు. కాల్పులు జరపడానికి ముందు ఇద్దరు టెర్రరిస్టులు బైరసన్ లోయ వద్దకు వచ్చి పరిస్థితిని, టూరిస్టులను పరిశీలించి.. ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో వచ్చి అటాక్ చేసినట్లు గుర్తించారు. కాగా, ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు మృతిచెందగా, మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన భారత్‌నే కాకుండా.. మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది. పెహల్గాం ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల అధినేతలు ఖండించారు. ఈ కఠిన సమయంలో భారత్‌కు అండగా ఉంటామని మద్దతు ప్రకటించారు.