కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించా: Guntakandla Jagadish Reddy

by Ajay kumar |   ( Updated:2025-04-26 13:43:32.0  )
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించా: Guntakandla Jagadish Reddy
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని ఒకే ఒక్కసారి వ్యతిరేకించానని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తానంటే తాను అంగీకరించలేదని చెప్పారు. అంతకు ముందు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా మొదట తానే అంగీకరించేవాడినని అన్నారు. కానీ నిరాహార దీక్ష విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నారా అని అనుకున్నట్టు చెప్పారు. తెలంగాణకు నాయకుడు లేకుండా పోతాడా అనే భయంతో వ్యతిరేకించానని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకున్ని తెలంగాణ తయారు చేసుకుందన్నారు.

అనుకున్నది జరగకపోతే రాష్ట్రానికే నష్టం జరుగుతుందని అనిపించిందని కానీ అందరినీ ఒప్పించారని, చివరికి తనను కూడా ఒప్పించారని చెప్పారు. 99 శాతం తెలంగాణ ఇస్తారని నమ్మకం ఉందని, ఒకవేళ ఇవ్వకపోతే పోతే పోతాను అని చెప్పారని తెలిపారు. తనకు ఏమైనా జరిగినా ఒకవ్యక్తితో ఆగేది ఉద్యమం కాదని మీలోనే ఎవరో ఒకరు పుడతారని కేసీఆర్ చెప్పారన్నారు. కేసీఆర్ కు ఆయన బలం ఆయన ఆత్మవిశ్వాసం అని అన్నారు. కేసీఆర్ ఆయనకు ఆయనే సమస్యలు సృష్టించుకుంటార‌ని ఆయ‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటార‌ని స‌ర‌దాగా అనుకుంటార‌ని తెలిపారు. కేసీఆర్ అస‌లు బ‌ల‌హీన‌త మాన‌వీయ‌త అని దానికి ఆయ‌న లొంగుతార‌ని చెప్పారు.



Next Story

Most Viewed