- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపైనే మద్యపానం.. మొద్దు నిద్రలో అధికారులు..!
దిశ, ఉప్పల్: ఉప్పల్ మండే మార్కెట్ రోడ్డు రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ ఇండ్లు, సీడీఎఫ్డీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, పోస్టాఫీస్‌కు సంబంధించిన క్వాటర్స్ ఉన్నాయి. అలాంటి రోడ్డును ఆనుకొని శ్రీ విజయదుర్గ వైన్స్ దుకాణం ఉంది. కాగా వైన్స్‌లో మందుకొనే వారిలో అధిక శాతం ఆ రోడ్డుపైనే తాగుతున్నారు.
సాయంత్రం 5 దాటిందంటే
ఈ వైన్స్ దుకాణానికి వచ్చే మందుబాబుల వల్ల ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నుంచే ఉప్పల్, బోడుప్పల్‌కు రాకపోకలు సాగింస్తుంటారు. మందుబాబులు ఈ రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలు ఆపి మందు తాగుతుండడంతో వాహనదారులు, పాదచారులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే పట్టించుకుంటారా? లేకపోతే లేదా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్, ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోకపోతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు గతంలో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని, ఇకనైనా సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.