- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T BJP: బీజేపీ సంగ్రామ పర్వం.. జనవరి నుంచి షురూ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ తన దూకుడును పెంచాలని చూస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయఢంకా మోగించిన కమలం పార్టీ ఆ తర్వాత సైలెంట్ అయింది. పార్టీలో వాతావరణం పూర్తిగా స్తబ్దుగా మారింది. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి బీజేపీ సంగ్రామ పర్వాన్ని మొదలుపెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలని కాషాయ నేతలు వ్యూహరచన చేపడుతున్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ టార్గెట్ గా ప్రోగ్రామ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్తబ్దుగా మారిన కమలదళంలో సభ్యత్వాల ప్రక్రియ కొనసాగింది. ఆపై సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. వీటికి తోడు పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం ఉండటంతో పార్టీ స్తబ్దుగా మారిందని పలువురు చెబుతున్నారు. అయితే సభా పర్వం, సభ్యత్వ పర్వం పూర్తయిందని, సంఘటన పర్వం కొనసాగుతోందని, అది కూడా పూర్తయితే వచ్చే ఏడాది జనవరి నుంచి సంగ్రామ పర్వమేనని కమలనాథులు ధీమాగా ఉన్నారు. కాషాయ సేన సత్తా అప్పుడు చూస్తారనే ధీమాతో ఉన్నారు. వచ్చే నెల నాటికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, స్టేట్ చీఫ్ నియామకం సైతం పూర్తవుతుండటంతో వచ్చే నెల నుంచి సంగ్రామం మొదలుపెట్టి దూకుడుగా వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది.
తెలంగాణలో త్వరలో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. అనంతరం స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో సత్తా చాటేందుకు బీజేపీ జనవరి నుంచి సంగ్రామ పర్వాన్ని షురూ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు జోష్ తో భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. గతంలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపు అనంతరం పలువురు ఎంపీలు తమ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషిచేశారని, రాబోయే ఎన్నికల్లో ఆ కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తమపై ఉందని బాహటంగానే చెప్పారు. మరి భవిష్యత్ ఎన్నికల కోసం వచ్చే నెలలో ప్రారంభించనున్న సంగ్రామ పర్వంలో లోక్ సభ సభ్యులు ఎంతమేర పోరాడుతారనేది చూడాలి.