- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సు ఎక్కిన ప్రయాణికురాలి బంగారం చోరీ
దిశ ,బిజినేపల్లి : బస్సు ఎక్కినా ప్రయాణికురాలి బంగారం చోరీ అయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బిజినాపల్లి మండల జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో ఓ మహిళ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. బిజినపల్లి నుంచి జడ్చర్ల వెళ్లడానికి వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కింది. బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో.. తన కుడి చేతికి ఉన్న తులం బంగారం బ్రాస్లైట్ ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మరికొద్ది సేపటికి ఆమె చేతికున్న బంగారు బ్రాస్లెట్ లేకపోవడంతో..కంగారుపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు బిజినపల్లి బస్సు బస్టాండ్ కి చేరుకొని బస్సులో ఉన్న ప్రతి ఒక్కరిని చెక్ చేశారు. చైను ఆచూకీ దొరకకపోవడంతో బస్సును పంపించారు. బస్టాండ్ లో పట్ట పగలే ఇలా దొంగతనాలు జరుగుతుండడంతో..ప్రయాణికులు కంగు తింటున్నారు. బస్టాండులో నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి, నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.