- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖాళీ అవుతున్న కస్తూర్బా విద్యాలయం..సిబ్బంది సమ్మెతో ఇంటిబాట
దిశ,మంగపేట : కస్తూర్బా విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను రెగ్యులరైజ్ చేసి విద్యా శాఖలో విలీనం చేయాలంటూ ఈ నెల 10 నుంచి సమ్మెకు దిగారు.దీంతో విద్యార్థులకు విద్యా బోధన జరగక సరైన భోజనం అందక విద్యార్థులు ఇంటి బాట పట్టడంతో కస్తూర్బా విద్యాలయం ఖాళీ అవుతుంది. 6వ, తరగతి నుండి ఇంటర్ వరకు 155 మంది విద్యార్థులతో రోజు కల కలలాడిన కస్తూర్బా విద్యాలయం నేడు కేవలం 45 నుంచి 50 మంది విద్యార్థులతో వెల వెల బోతుంది. సమ్మెకు తోడు ఈ నెల 25 నుంచి క్రిస్మస్ సెలవులు ఉండటంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. బోధన, బోధనేతర సిబ్బంది సమ్మె కారణంగా తరగతుల నిర్వహణ జరగడం లేదనే కారణాలతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా వరకు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి పొదెం మేనక లోకల్ బాడీస్ నుంచి నలుగురు ఉపాధ్యాయులను తాత్కాలికంగా డిప్యూట్ చేసినట్లు తెలిపారు. పగలు ఇద్దరు రాత్రి వేళ ఇద్దరు ఉపాద్యాయులను విద్యార్థుల పర్యవేక్షణకు ఉంచినట్లు తెలిపారు. ఐనప్పటికీ ఆ నోటా ఈ నోటా విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియడంతో విద్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. 155 మందిలో ప్రస్తుతం 50 మంది వరకు విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాలయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నట్లు ఎంఈవో మేనక తెలిపారు.ఈ విషయమై డీఈవో ఫణిని వివరణ కోరగా కస్తూర్బా విద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది పీజీ సీఆర్టీ, సిఆర్టీలు సుమారు 11 మంది వరకు ఈ నెల 10నుండి సమ్మెలో ఉన్నారని విద్యార్థుల పర్యవేక్షణకు లోకల్ బాడీస్ నుండి నలుగురు ఉపాద్యాయులను తాత్కాలికంగా ఏర్పాటు చేసి పర్యవేక్షస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి క్రిస్మస్ సెలవులు ఉండడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లారని విద్య భోధన, భోజన వసతులు సక్రమంగానే ఉన్నయని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సోమవారం నుండి యధావిధిగా కస్తూర్బా విద్యాలయాల్లో తరగతులు నడుస్తాయన్నారు.