'108'లో ప్రసవం..తల్లి బిడ్డ క్షేమం

by Aamani |
108లో ప్రసవం..తల్లి బిడ్డ క్షేమం
X

దిశ, చిలుకూరు: పురిటి నొప్పులతో సతమతమవుతున్న మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. మండలంలోని చెన్నారిగూడేనికి చెందిన బొడ్డుపల్లి భవాని శనివారం రాత్రి పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా బంధువులు చిలుకూరు '108'కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది గర్భిణిని ఆసుపత్రికి తీసుకొస్తుండగా నొప్పులు అధికం కావడంతో వాహనంలోని ఈఎంటీ ఎం.తిరుపతయ్య తన విధుల్లో భాగంగా మహిళకు ప్రసవం చేశారు. పండంటి అమ్మాయి ప్రసవించింది. తరువాత వారు తల్లీ బిడ్డను హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన చిలుకూరు పీహెచ్ సీ '108' సిబ్బందికి భవాని భర్త గంగోలి, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story