- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా..
దిశ, కూసుమంచి : వేగంగా వెళుతున్న ఓ కారు మీడియన్ ప్లాంటేషన్ డివైడర్ ను ఢీకొని,అదుపుతప్పి మరో కారును ఢీకొని పల్టీ కొట్టింది.ఈ ఘటన కూసుమంచి మండలం, జీళ్లచెరువు గ్రామ సమీపంలోని ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి 365 బీబీ పై ఆదివారం చోటుచేసుకుంది.నేషనల్ హైవే పెట్రో 1033 భద్రత సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదు నుంచి ఖమ్మం వెళుతున్న వెన్యూ కార్ జాతీయ రహదారి లోక్య తండా దాటిన తర్వాత ప్రమాదవశాత్తు జీళ్ల చెరువు బ్రిడ్జి పై అదుపుతప్పి పల్టీ కొడుతూ ముందు వెళ్తున్న మరొక కారును ఢీ కొనడంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కూసుమంచి పోలీసులు హైవే పెట్రో 1033 భద్రత సిబ్బంది ,1033,108 అంబులెన్స్ సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో హైవే సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.