- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
దిశ, ఆసిఫాబాద్ : గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం కెరమెరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ల్యాబ్ ను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తో కలిసి ప్రారంభించారు. గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయులు తరగతులలో బోధించే పాఠ్యాంశాల తో పాటు డిజిటల్ ల్యాబ్ ల ద్వారా అర్థం కాని విషయాలను నేర్చుకుని వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
అనంతరం స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 13న నిర్వహించనున్న జంగుబాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టరేట్ లో నూతనంగా రెవెన్యూ విభాగంలో ఎంపికై 36 మంది గ్రూప్-4 అభ్యర్థులకు జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి నియామక పత్రాలు అందజేశారు.