Redmi 14C 5G: జనవరి 6న రెడ్‌మీ నుంచి 5జీ కొత్త ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

by Maddikunta Saikiran |
Redmi 14C 5G: జనవరి 6న రెడ్‌మీ నుంచి 5జీ కొత్త ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి(Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ(Redmi) జనవరి 6న కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. రెడ్‌మీ 14సీ 5జీ(Redmi 14C 5G) పేరుతో భారత్(India) తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో(Global Markets) దీన్ని విడుదల చేయనున్నారు. 4GB + 128GB, 4GB + 256GB, 6GB + 128GB, 8GB + 256GB వేరియంట్లలో లభించనుంది. రెడ్‌మీ కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌(Amazon)లో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. అయితే ఫోన్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

రెడ్‌మీ 14సీ 5జీ స్పెసిఫికేషన్స్ ఇవే..

  • 6.88 ఇంచెస్ డాట్ డ్రాప్ డిస్ ప్లే+ 450 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంది.
  • 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS14 తో రాబోతోంది.
  • మీడియా టెక్ హీలియో G81 అల్ట్రా ప్రాసెసర్ తో రన్ అవుతుంది.
  • ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,160mah బ్యాటరీని అమర్చారు.
  • USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Advertisement

Next Story

Most Viewed