- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Venkatesh: ఆ సీన్ మా అన్నయ్యకు ఇష్టం.. వంద పాములతో చేశానంటూ బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
దిశ, వెబ్ డెస్క్ : ఆహా ఓటీటీలో బాలకృష్ణ ( Balakrishna) హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి వెంకటేష్ ( Daggubati Venkatesh ) వెళ్ళిన ఎపిసోడ్ ని మేకర్స్ విడుదల చేశారు. వీరిద్దరూ కలిసి షోలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అంతే కాదు, ఈ షో లో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు.
ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రాజా మూవీలో కొండచిలువని పట్టుకున్న ఒక ఫోటోను చూపించి.. ఆ మూవీలో నిజమైన జంతువులతో తీసారా లేక రీల్ వాటితో తీసారా అని అడగగా వెంకీ షాకింగ్ విషయాలు చెప్పాడు. " ఆ మూవీ అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం. ఆ సినిమాలో నేను ఒకటి కాదు రెండు కాదు .. వంద పాములతో ఆ సీన్ చేశాను. ఓ హాలీవుడ్ మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం. నేను చెయ్యగలనా అని చాలా భయపడ్డా .. కానీ, చివరికి ధైర్యం తెచ్చుకొని ఆ పాములున్న రూమ్ లోకి దూకేసాను. కెమెరాలు దూరంగా పెట్టుకున్నారు. అక్కడ ఉండే పాముల అబ్బాయి నా మీద పాములు వేశారు అది గొప్ప అనుభవం" అంటూ ఆ మూవీ గురించి చెప్పారు.
ఇక, ఈ సంక్రాంతికి వెంకటేష్ కూడా మనల్ని అలరించబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న " సంక్రాంతికి వస్తున్నాం " మూవీతో జనవరి 14న ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.