- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Half day school:విద్యార్థులకు అలర్ట్.. ఒంటిపూట బడుల టైమింగ్స్‌లో మార్పు

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయాన్నే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఒంటిపూట బడులు(half Day School) ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణ్రోగ్రతల దృష్ట్యా.. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రేపటి(మార్చి 15) నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్తో ఆఫ్ డే స్కూల్ టైమింగ్స్ వెల్లడించింది.
ఆఫ్ డే స్కూల్ టైమింగ్స్..
ఏపీ(Andhra pradesh)లో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ(Telangana)లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.