- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు(Kurnool)లో టీడీపీ నేత సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వైసీపీ(Ycp)లో పని చేశారు. అయితే రామాంజనేయులు(అంజి), సంజయ్ కుటుంబం మధ్య ఏళ్లుగా వివాదాలు కొనసాగాయి. కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయుడు సంజయ్ కాగా.. బైరెడ్డి సిద్ధార్థ్ అనుచరుడు రామాంజనేయులు. సంజన్న భార్య వైసీపీ కార్పొరేటర్‌గా పని కేశారు. ప్రస్తుతం సంజన్న కొడుకు జయరాం కార్పొరేటర్‌గా గెలిచారు.
గత ఎన్నికల సమయంలో కాటసానితో విభేదాలు రావడంతో సంజన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలుత గౌర సుచరితా రెడ్డి వర్గంలో చేరాలని భావించినా ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గంలో చేరారు. అయితే సంజన్న రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి 9 గంటలకు గుడేకల్లు మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన రామాంజనేయులు (అంజి), ఆయన అనుచరులు దారి కాసి మరీ సంజన్నపై కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సంజన్నను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజన్న మృతి చెందారు.
దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శరీన్ నగర్‌లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాదం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శరీన్‌నగర్‌లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
కాగా సంజన్నపై దాడి చేసిన అంజిపై గతంలో కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈశ్వరుడు అనే వ్యక్తి హత్య కేసులో అంజి నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే ఆ కేసును కోర్టు వేసింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరవర్గంలో అంజి చేరారు. మూడు నెలల క్రితం సంజన్నకు, అంజికి మధ్య గొడవ జరిగింది. దీంతోనే అంజి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.