బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై మరో కేసు

by Ramesh Goud |
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై మరో కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే పలు కేసులలో దోషిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే (BRS Former MLA) పై మరో కేసు (Another One Case) నమోదు అయ్యింది. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే (Bellam Pally Former MLA) దుర్గం చిన్నయ్యపై (Durgam Chinnaiah) బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి (BRS MLA Jagadeesh Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ (Suspend) చేయాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) పట్టుబట్టడంతో స్పీకర్ ఈ అసెంబ్లీ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీనిపై అసహనం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. అంతేగాక ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మను దగ్దం చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు దుర్గం చిన్నయ్యతో పాటు మరో 14 మందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు దుర్గం చిన్నయ్య సహా నిరసనలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులపై కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed