- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పక్షులపై ప్రేమ.. పంటను వదిలేసిన రైతు..

దిశ,ఝరాసంగం : పక్షులపై ఉన్న ప్రేమతో ఓ మహిళ తన పొలంలో ప్రత్యేకంగా వేసిన పంటను వదిలేసింది. పక్షుల ఆకలి తీర్చడం కోసం సునీత అనే మహిళ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన యువ మహిళా రైతు గొల్ల సునీత తనకున్న 28 గుంటల భూమిలో 20 గుంటల లో శనగ పంటను వేశారు. మిగిలిన 8 గుంటలలో నల్ల కుసుమను పంటను వేశారు. నల్ల కుసుమ పంట చేతికి వచ్చే సమయానికి రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు, తదితర పక్షులు వాటికి ఇష్టమైన నల్ల కుసుమలను తింటూ ఆకలిది తీర్చుకుంటున్నాయని గమనించింది. దీంతో సునీత పక్షులపై ఉన్న ప్రేమతో పంటను మొత్తం వదిలేసింది. ఉదయం, సాయంత్రం రామచిలుకలు వివిధ పక్షులు నల్ల కుసుమను తింటూ ఆనందిస్తున్నాయి. పొలం చుట్టుపక్కల చెట్లతో పాటు మూడు బోరు బావులు ఉండడంతో పక్షులు ఆకలి తీర్చుకున్న తర్వాత బోరు బావుల దగ్గర పిచ్చుకలు నీరును సేవిస్తున్నాయి. పక్షుల ఆకలి తీర్చడం సంతోషాన్ని కలిగించిందని సునీత అన్నారు.