ఒకే బ్యానర్‌పై మూడు భారీ ప్రాజెక్ట్స్ చేయనున్న లోకేష్ కనగరాజ్.. హీరోలు ఎవరంటే? (ట్వీట్)

by Hamsa |   ( Updated:2025-03-24 12:20:51.0  )
ఒకే బ్యానర్‌పై మూడు భారీ ప్రాజెక్ట్స్ చేయనున్న లోకేష్ కనగరాజ్.. హీరోలు ఎవరంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో పలు చిత్రాలు చేస్తూ వరుస హిట్స్ సాధిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’(Coolie). ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తుండగా.. పూజా హెగ్డే(Pooja Hegde), శృతి హాసన్(Shruti Haasan), సత్యరాజ్, ఉపేందర్, నాగార్జున వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, లోకేష్ కనగరాజ్ ఓ మూడు భారీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాలను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారని సమాచారం. ఒకటి సూర్య రోలెక్స్ కాగా.. మరో మూవీ కార్తి ‘ఖైదీ-2’ అని తెలుస్తోంది. అయితే ఇందులో మూడవ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ మూడు సినిమాలు హిట్ అవడం ఖాయమని అంటున్నారు.

Next Story

Most Viewed