ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Kavitha |   ( Updated:2025-04-07 06:31:34.0  )
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’(Court). ఇందులో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai Kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) తదితరులు కీలక పాత్ర పోషించారు. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీష్(Ram Jagadeesh) తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. సుమారు రూ.10కోట్ల బడ్జేట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT)లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓటీటీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్(NetFlix)లో స్ట్రీమింగ్ చేయనున్నారట. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

కాగా కోర్ట్ సినిమా థియేటర్లలో తెలుగు భాషలోనే రిలీజ్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Read More..

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Next Story

Most Viewed