ఏపీలో తెలుగు యూట్యూబర్ కు టార్చర్... మతం మారాలంటూ?

by Veldandi saikiran |
ఏపీలో తెలుగు యూట్యూబర్ కు టార్చర్... మతం మారాలంటూ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు యూట్యూబ్ రామ్ కు ( Ram the Traveller) కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. విదేశాల్లో మొన్నటి వరకు సైకిల్ యాత్ర చేసిన రామ్ అనే తెలుగు ట్రావెల్ యూట్యూబర్... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఎప్పటి లాగే తన సైకిల్ పైన... యాత్ర మొదలుపెట్టాడు రామ్. గత నెలలో నెల్లూరులో ప్రారంభించిన తన సైకిల్ యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఏపీలో రామ్ అర్ధరాత్రులు కూడా సైకిల్ తొక్కుతూ... ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే.. తెలుగు యూట్యూబర్ రామ్ కు ఊహించని పరిణామం ఎదురైంది.

అతడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంటే.. ఓ వ్యక్తి మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలోనే రామ్ కూడా... బైక్ పైన వచ్చిన సదరు వ్యక్తితో చాలా చక్కగా మాట్లాడాడు. ఇంకేముంది ఏపీలోని ఓ ప్రముఖ మతంలో.. చేరాలని యూట్యూబర్ రామును ( Ram the Traveller) కోరాడు. దానికి యూట్యూబర్ రాము.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. జై శ్రీరామ్ అను అంటూ ఆ బైక్ పైన ఉన్న వ్యక్తిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడి నుంచి ఓ ప్రముఖ మతానికి సంబంధించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన తెలుగు ప్రజలు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి కూడా మత ప్రచారాలు ఏంట్రా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.


Next Story

Most Viewed