- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Netflix: నెట్‌ఫ్లిక్స్ సేవలకు అంతరాయం.. లాగిన్‌లో సమస్యలు!

దిశ, వెబ్ డెస్క్:ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సాకేంతికంగా సమస్యలు తలెత్తడంతో నెట్‌ఫ్లిక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రైబర్లు (Subscribers) ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్, చికాగో, డాలస్, లాస్ ఏంజెలెస్‌లోని యూజర్లు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అక్కడి యూజర్లు సమస్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లాగిన్‌లో ఎర్రర్ వస్తోందని, తమ ఖాతాను ఓపెన్ చేయలేకపోతున్నామని తెలియజేశారు. 'సమ్ థింగ్ వెంట్ రాంగ్.. కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి' అనే సందేశం స్క్రీన్‌పై దర్శనమిస్తున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. అంతేకాక మరికొంతమంది యూజర్లు.. ప్రొఫైల్ మిస్ మ్యాచ్ అవుతుందని వెల్లడించారు. ఒక ప్రొఫైల్‌లో వీక్షించిన జాబితా.. మరో ప్రొఫైల్‌లో కనిపిస్తుందని తెలిపారు. కొన్ని గంటలపాటు ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే స్పందించిన సంస్థ.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నెట్‌ఫ్లిక్స్ సాంకేతిక బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.
ఇక, ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 2025 నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌ను 300 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. కేవలం అమెరికా ఒక్క దేశంలో ఈ సంఖ్య 81 మిలియన్లగా ఉంది. తాజాగా ఏర్పడిన సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్లకు ఇది ఆటంకంగా మారింది.