- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pahalgam Attack: ప్రతీకార చర్యలకు వెళ్తే భారత్ ఎదుట 4 ఆప్షన్స్

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ దాడితో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ప్రతిస్పందనగా తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడి పెంచడంతో పాటు.. భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా చేసేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. కానీ, ఈ దాడికి కారణమైన ముష్కరులను వదిలిపెట్టవద్దని దేశప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఇలాంటి టైంలో పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకొంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై ఎలాంటి కామెంట్లు చేయట్లేదు. అయితే, సైనిక చర్య తీసుకోవాలంటే మాత్రం భారత్ ఎదుట నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఫైటర్ జెట్ల ద్వారా..
వాయుసేనలో ఉన్న అధునాతన యుద్ధ విమానాలు రఫేల్, మిరాజ్ 2000లను ఉపయోగించి పాక్‌లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయడం. ఈ ఫైటర్ జెట్‌లు శత్రుస్థావరాల్లోకి సమర్థవంతంగా చొచ్చుకుపోయేలా హై-స్పీడ్ సామర్థ్యాలు, అధునాతన రాడార్, క్షిపణి వ్యవస్థలతో అమర్చి ఉన్నాయి. అయితే, ప్రమాదాల్లో సంభావ్య తీవ్రతరం, గగనతల ఆంక్షల ఉల్లంఘనలపై అంతర్జాతీయ పరిశీలనలు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ఆప్షన్‌ను వాడితే అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో బాలాకోట్‌పై దాడి తర్వాత జరిగిన అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది.
నియంత్రణ రేఖ వెంబడి దాడి
కాగా.. భారత్ ఆంక్షల తర్వాత సిమ్లా ఒప్పందాన్ని పక్కనపెడతామని పాక్ బెదిరించింది. దీంతో, నియంత్రణ రేఖ(LOC) ఉండదు. ఈ నేపథ్యంలో భారత్ దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం లభిస్తుంది. ఇటీవలి కాలంలో ఎల్‌వోసీ వద్ద పాక్ జరిపిన ఉల్లంఘనలు భారత్‌కు ఓ కారణాన్ని అందిస్తాయి. దీంతో, ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్లు చేపట్టవచ్చు. కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాలుగా మారవచ్చు. ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం, ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉన్నాయి. దీంతో, ఈ ఆపరేషన్ భారత్ కు ప్రతికూలంగా మారవచ్చు.
సర్జికల్ స్ట్రైక్స్..
గతంలో మాదిరిగానే, భారీ టార్గెట్లను గుర్తించి.. సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కూడా భారత్ ఎదుట ఉన్న ఆప్షన్. కాకపోతే పాక్ అప్రమత్తంగా ఉండటంతో.. ఈ ఆపరేషన్లు దానిని షాక్‌కు గురిచేయవు. ఈ దాడులు అమలుచేయాలంటే.. రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్, శక్తిమంతమైన దళాలు, కచ్చితమైన ప్రణాళిక ఉంటేనే అది సాధ్యం అవుతోంది.
ఫిరంగులు, స్నైపర్లతో దాడులు..
లక్ష్యాల పైకి గురిపెట్టి భారీ ఫిరంగులు, స్నైపర్ గన్స్‌తో కాల్పులు జరపడం మరో ఆప్షన్‌గా ఉంది. వీటితోపాటు భారీ మోర్టార్లు కూడా వాడొచ్చు. వీటివల్ల తక్కువ ఉద్రిక్తతలు తలెత్తుతాయి. ఈ ఆపరేషన్లు ఎల్‌ఓసీ వెంట శత్రు స్థానాలు, సరఫరా మార్గాలు లేదా అవుట్‌పోస్టులను అణగదొక్కడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాకపోతే భారీ దాడులంత ఫలితం వీటికి ఉండదు. అయితే, వీటివల్ల పెద్ద ఎత్తున దాడులకు పాల్పడకుండానే ప్రతిదాడులు జరిగే అవకాశం ఉంటుంది.