- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sridhar Babu: భూ భారతి సక్సెస్ బాధ్యత మీదే..

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి చట్టం విజయవంతంగా అమలయ్యేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. నోవాటెల్‌లో సీఎల్పీ మీటింగ్తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నియోజకవర్గాలలో అందుబాటులో ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్లను కేటగిరీల వారీగా అమలు చేస్తున్న తొలి రాష్టం తెలంగాణ అని స్పష్టం చేశారు. భూభారతి, ఆర్ఓఆర్చట్టానికి సంబంధించిన అంశాలపై సభ్యులకు తెలియజేస్తూ దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. అలాగే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలన్నీంటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారన్నారు. అనాడు ఇందిరమ్మ హయాంలో ఇండ్లు ఇచ్చామని, ప్రస్తుతానికి ఇండ్ల గురించి ఎదురుచూస్తున్న పేదవారికి ఈ ప్రభుత్వంలో అందజేయనున్నామన్నారు.
పేదవారి ఇండ్లకు సంబంధించి సీఎం, రెవెన్యూ మంత్రి అర్హులైన వారికి అందజేయాలని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అతి తర్వలో ఇండ్ల పథకాన్ని చేపట్టబోతున్నామని, దీన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యచరణ కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకొని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎల్పీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియజేడం జరిగిందన్నారు.
నాలుగు అంశాలపైనే చర్చ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సీఎల్పీలో ప్రధానంగా నాలుగు అంశాలపైనే చర్చ జరిగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, భూభారతి అంశాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రాల్లో ఎక్కడ లేనిది తెలంగాణలో సన్నబియ్యం ఇస్తున్నామని, సీఎల్పీలో తీసుకున్న నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్లేలా సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. పార్టీలో సమస్యలు సమావేశం దృష్టికి వస్తే సభ్యులతో సీఎం మాట్లాడతారని తెలిపారు.
నియోకవర్గాలలో మీటింగ్‌కు వస్తా: కొండా సురేఖ
నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే మీటింగ్ఏర్పాటు చేసినా తాను వస్తానని సీఎం హామీ ఇచ్చారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని సీఎం ఎమ్మెల్యేలకు చెప్పారని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ పగటి కలలు కంటోందని మంత్రి విమర్శలు చేశారు.