- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షూటింగ్ వరల్డ్ కప్‌లో సౌరభ్‌కు కాంస్యం
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : పెరులో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ స్టేజ్ 2లో భారత్ పతక ఖాతా తెరిచింది. భారత షూటర్ సౌరభ్ చౌదరి సత్తాచాటాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం దక్కించుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో సౌరభ్ 578 స్కోరుతో 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్ నుంచి వరుణ్ తోమర్(576) కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో కూడా సౌరభ్ రాణించాడు. 219.1 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. వరుణ్ 198.1 స్కోరుతో నాలుగో స్థానంతో సరిపెట్టాడు.
Next Story