- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చీర టైట్ గా కడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే

దిశ, వెబ్ డెస్క్: చీర కట్టుకోవడం చాలా మంది మహిళలకి ఎంతో ఇష్టం. కొత్త ట్రెండీ బట్టలు ఎన్ని వచ్చినా.. చీరలకు ఉన్న గిరాకీ ఏ మాత్రం తగ్గలేదు. పండగలు వస్తే చాలు ఆడవాళ్లు మనసు చీరనే కోరుకుంటుంది. అయితే చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే అవుననే చెప్పాలి. దీన్నే 'పెట్టీకోట్ క్యాన్సర్’ అని పిలుస్తారు. వినడానికి వింతగా ఉన్న.. ఈ క్యాన్సర్ వస్తే చుక్కలు చూస్తాం. గతంలో దీనిని ‘చీర క్యాన్సర్’గా పిలిచేవారు. అయితే ఈ పెట్టీకోట్ క్యాన్సర్ ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు కట్టుకొనే చీరలు అందులో ధరించి లంగాలను ట్రేట్ గా కట్టుకుంటే పెట్టీకోట్ క్యాన్సర్ లు వస్తున్నాయి. ముంబైలోని ఆర్‌ఎన్ కూపర్ హాస్పిటల్‌లో మహిళలు కట్టుకొనే చీరలపై ఓ అధ్యయనం చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి . చీరలను ట్రేట్ గా కట్టుకుంటున్న మహిళకు పెట్టీకోట్ క్యాన్సర్ వస్తుందని నిర్ధారించారు. రెండు వందల మంది మహిళలను అంకలజిస్ట్ వైద్యులు అధ్యయనం చేయగా.. వారిలో వంద మంది మహిళలు స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. చీరల వంటి సాంప్రదాయ వస్త్రధారణ , సాంస్కృతిక పద్ధతులు సౌకర్యాన్ని , సౌందర్యాన్ని, ఆకర్షణను అందిస్తాయి. అయితే అందమైన దుస్తుల ఎంపికలతో పాటు ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన కూడా అవసరం అని వైద్యులు అంటున్నారు. చీర క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు చీరను కట్టుకునేటప్పుడు చర్మంపై ఒత్తిడి రాకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.