- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుజరాత్ కు ఏఐసీసీ ఇంఛార్జిల నియామకం.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ హైకమాండ్ గుజరాత్లో పార్టీని బలోపేతం చేసి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతుంది. ఈసారి గుజరాత్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీనియర్లు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్లీనరి సమావేశంలో మోడీ హవాకు ఇక్కడ నుంచే అడ్డు కట్టవేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మిషన్ గుజరాత్ కింద కాంగ్రెస్ అధిష్టానం 43 మంది ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. వారికి జిల్లా అధ్యక్షులను నియమించే పని కూడా అప్పగించింది. ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీలో నలుగురు పీసీసీ పరిశీలకులతో కూడిన ఒక బృందాన్ని, ఒక ఏఐసీసీ పరిశీలకుడిని ఏర్పాటు చేశారు. ఈ పరిశీలకుల కమిటీలో తెలంగాణ నుంచి ఎంపీ బలరాం నాయక్, చల్లా వంశీచంద్‌రెడ్డికి చోటు కల్పించింది. ఆంద్ర నుంచి గిడుగు రుద్రరాజు అవకాశం ఇచ్చింది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా గుజరాత్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు.