ఫస్ట్ టైం కోక్ తాగిన అక్కడి వాసులు.. పళ్లు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు!

by D.Reddy |   ( Updated:2025-04-19 11:48:43.0  )
ఫస్ట్ టైం కోక్ తాగిన అక్కడి వాసులు.. పళ్లు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మందికి కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం కావటంతో ఉపశమనం, చల్లదనం కోసం కూల్‌డ్రింక్‌ తరచూగా తాగుతుంటారు. కానీ, బాహ్యా ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని తెగల వారికి కోకా కోలా (Coca cola) రుచి చూపిస్తే ఎలా ఉంటుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి దంతాలు చాలా బలంగా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అదేంటి కోకా కోలా తాగితే పళ్లు స్ట్రాంగ్ ఉన్నాయంటూ కామెంట్ పెట్టడం అనుకుంటున్నారా? వీడియో చూస్తే మీరు కూడా నిజమే అంటారు. మరీ చూసేయండి.

ఆఫ్రికా ఖండంలోని టాంజానియా (Tanzania) దేశంలోని హాడ్జాబే తెగ ప్రజలు జీవిస్తున్నారు. వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. అడవిలో ఉంటూ వేటాడుతూ జీవనం సాగిస్తుంటారు. అయితే, వీరికి ఇటీవల ఓ యూట్యూబర్ కోకా కోలాను రుచి చూపించాడు. మొదట బాటిల్‌ను చూసి ఆశ్చర్యపోయినా వారు.. దాన్ని తెరిచేందుకు ఆసక్తికనబరిచారు. జాగ్రత్తగా పరిశీలిస్తూ, దాన్ని ఎలా తెరవాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. పంటితో గట్టిగా కోరకటంతో అందులోంచి డ్రింక్ ఒక్కసారి పైకి పొంగింది. ఇక మొదటి సిప్ తీసుకున్న తర్వాత, బుడగలు, తీపి రుచికి ఆశ్చర్యపోయి నవ్వుతూ కనిపించారు. 'ఇది నీరులా ఉంది, కానీ తీపిగా, వింతగా ఉంది' అని వారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే, కొందరు నెటిజన్లు ఈ సంఘటనను ఆనందంగా చూస్తుండగా, మరికొందరు ఆధునిక ఉత్పత్తులు గిరిజనుల సాంప్రదాయ జీవనశైలి, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/TheImmortal007/status/1911803188010680659



Next Story

Most Viewed