శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

by Sumithra |
శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పసుమాములలో జరిగిన శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి కళ్యాణం వేడుకలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సకల సుగుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు శ్రీ రాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నారు.

రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది గోచరమౌతుందన్నారు. సీతాతత్వం శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవిస్తే మనిషిలోని దుర్గుణాలు రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయన్నారు. ఆయనకు సేవ చేసే భాగ్యం పొందిన హనుమాన్ అన్ని యుగాలకు ఆదర్శమైన శ్రీరామ భక్తునిగా మిగిలిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి జయపాల్ రెడ్డి, పాలక వర్గం డైరెక్టర్లు చెట్టి రాజు గౌడ్, చర్లపల్లి బాబు గౌడ్, సుచరిత సత్యనారాయణ గౌడ్ చెవుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed