- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ విజయం.. ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: కెనడాలో జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ (Mark Carney) నేతృత్వంలోని లిబరల్ పార్టీ (Liberal Party) ఎన్నికల్లో విజయం సాధించిం.. మళ్లీ అధికారంలోకి వచ్చింది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాగా ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వాణిజ్య యుద్ధం, కెనడాపై ఆర్థిక ఒత్తిడి బెదిరింపుల నేపథ్యంలో జరిగాయి. మార్క్ కార్నీ, మాజీ బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్, జస్టిన్ ట్రూడో రాజీనామా (Justin Trudeau resigns) తర్వాత మార్చి 2025 లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అతను ట్రంప్‌కు వ్యతిరేకంగా జాతీయవాద సందేశంతో ప్రచారం చేసి విజయం సాధించారు. కాగా మార్క్ కార్నీ విజయం (Mark Carney's victory)పై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో.. "కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికైనందుకు, విజయం సాధించిన లిబరల్ పార్టీకి అభినందనలు. భారతదేశం, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్ట పాలన పట్ల దృఢమైన నిబద్ధత, శక్తివంతమైన ప్రజల మధ్య సంబంధాలతో కట్టుబడి ఉన్నాయి. మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, మా ప్రజలకు మరిన్ని అవకాశాలను తెరవడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను." అని ప్రధాని మోడీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.