కట్టలు తెంచుకున్న Jr.NTR కోపం.. విజయశాంతి మాట్లాడుతుండగా స్టేజీ మీద నుంచి వెళ్లిపోయే ప్రయత్నం!

by Gantepaka Srikanth |
కట్టలు తెంచుకున్న Jr.NTR కోపం.. విజయశాంతి మాట్లాడుతుండగా స్టేజీ మీద నుంచి వెళ్లిపోయే ప్రయత్నం!
X

దిశ, వెబ్‌డెస్క్: అభిమానుల కేరింతలు, అల్లర్లు హీరోలకు ఆనందాన్ని ఇస్తాయి.. కానీ అన్ని సార్లూ కాదు. ఒక్కోసారి ఆ అభిమానమే హీరోలను ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. కొందరు ఫ్యాన్స్ చేసే అత్యు్త్సాహం కారణంగా హీరోలు క్షమాపణ చెప్పిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితినే యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR) ఎదుర్కొన్నాడు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా(Arjun son of Vyjayanthi) ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే.. విజయశాంతి మాట్లాతున్నంతసేపు అభిమానులంతా ‘సీఎం సీఎం’ అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అరుపులు, కేకలతో హోరెత్తించారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఎన్టీఆర్.. ‘అరవడం ఆపుతారా?.. నేను స్టేజీ మీద నుంచి వెళ్లిపోవాలా?’ అంటూ మండిపడ్డారు. దీంతో విషయం అర్ధం చేసుకున్న విజయశాంతి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ ఇద్దరినీ పక్కననిల్చోబెట్టుకుని మాట్లాడారు. విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్‌(Sai Manjrekar) హీరోయిన్‌‌గా నటించింది. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

Most Viewed