- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Honest Thieves: 15 లక్షలు కాజేశారు.. లక్ష రూపాయలు దేవుడుకి ఇచ్చారు.. మిగిలిన డబ్బులతో అన్నదానం చేశారు.. చివరకు..!

దిశ, వెబ్‌డెస్క్: Honest Thieves: దొంగల్లోనూ నిజాయితీ దొంగలు కూడా ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇస్తుంటారు. అలాంటి ఓ ముగ్గురు దొంగలు దోచుకున్న డబ్బులు ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మిగిలిన డబ్బులతో అన్నదానం చేశారు. ఈ దొంగలు చేసిన పనికి నెటిజన్లు మాత్రం శభాష్ అంటున్నారు. అసలు విషయం ఏంటంటే రాజస్థాన్ లోని అజ్మీర్ లోని ఈ ముగ్గురు దొంగలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు.
అయితే దొంగతనానికి వెళ్లే ముందు దేవుడిని ఓ కోరిక కోరుకున్నారట. వీరు ఓ షాపింగ్ మాల్ లో దొంగతనానికి వెళ్లే ముందు అంతా సజావుగా సాగితే ఆలయానికి విరాళం ఇస్తామంటూ దేవుడికి మొక్కున్నారు.దేవుడికి మొక్కినట్లుగానే ఆ షాపింగ్ మాల్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా దొంగతనం చేశారు. రూ. 15లక్షలు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులో నుంచి ముందే అనుకున్నట్లు మాట తప్పకుండా ఆలయానికి విరాళం ఇచ్చారు. అందులో నుంచి కొంత డబ్బును పేదలకు అన్నదానం చేశారు. అయితే షాపింగ్ మాల్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. విచారణలో తాము చేసిన విషయాలను పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. దొంగలలో ఇలాంటి నిజాయితీపరులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. కానీ వీరు చేసింది తప్పే అంటూ అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో ఈ దొంగలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు.
అయితే ఈ దొంగలు చేసిన పనికి నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీలాంటి దొంగలు ఉండటం మా అదృష్టం..మీలో దయగుణం ఉంది..కాకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో విరాళాలు ఇస్తే సంతోషించేవాళ్లమని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..అక్రమంగా సంపాదించిన డబ్బు అనుకుంటా అందుకే దేవుడు వీళ్లతో లాగేసాడు అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.