- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chiranjeevi: ఆ పనిని తీవ్రంగా ఖండిస్తున్నా.. వారిని వదిలే ప్రసక్తి లేదంటూ చిరు షాకింగ్ ట్వీట్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. అలాగే ఆయన సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇటీవల చిరుకు ఊకే పార్లమెంట్ వారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చి ఆయనను గౌరవించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. కొంతమంది చిరు పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు.
తాజాగా, ఈ విషయంపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘నా ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలవాలనుకునే వారి నుంచి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరికి వారికి ఇవ్వండి. లేదంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమే. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడా కూడా ఇలాంటి చర్యలను అనుమతించను. మీ ప్రేమ, ఆప్యాయత, బంధం వెలకట్టలేనిది.
దీన్ని ఎవ్వరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చలేరని అనుకుంటున్నాను. ఇలాంటి దోపిడీకి దూరం ఉందాం’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చిరు ట్వీట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం అలా చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు. కాగా, చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’(Vishvambhara) సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ త్రిష(Trisha), అషికా రంగనాథ్ (Ashika Ranganath)హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మూవీ మేకర్స్ అప్డేట్స్ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు.