జస్ట్ ఫర్ ఫన్ అంటూ ఆ వీడియో షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-03-21 05:26:15.0  )
జస్ట్ ఫర్ ఫన్ అంటూ ఆ వీడియో షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే రీసెంట్‌గా ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Thattil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

అందులో ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ అమ్మే బాయ్స్ చేసే కామెడీ మనందరికీ తెలిసిందే. చేతిలో డైరెక్ట్‌గా ఐస్ క్రీం ఇవ్వకుండా నానా హంగామా చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం మన కీర్తి సురేష్ వాళ్లని ఓ ఆట ఆడుకున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘జస్ట్ ఫర్ ఫన్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో ఫన్నీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

టవల్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ.. ఛీ ఛీ ఎంత బరితెగించావు అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు..


Next Story