- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో కార్యక్రమంతో ముందుకొచ్చిన స్టూడెంట్స్ ఫర్ సేవా బృందం.. దివ్యాంగ విద్యార్థులకు సాయం

దిశ, వెబ్ డెస్క్: ఎల్లప్పుడూ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందే స్టూడెంట్స్ ఫర్ సేవా బృందం (Students For Seva Team) మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా పూర్తి చేశారు. పదవ తరగతి పరీక్షల్లో (10th Class Exams) దివ్యాంగ విద్యార్థులకు (Disabled Students) సాయం చేసి, తమ మంచి మనసును చాటుకున్నారు. ఎస్ఎఫ్ఎస్ హైదరాబాద్ (SFS Hyderabad) సిటీ కో-కన్వీనర్ సవ్వాడి క్రిష్ ఆధ్వర్యంలోని బృందం.. దేవార్న్ పాఠశాలలోని (Devarn School) దివ్యాంగ విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షలను (SSC Exams) విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకారం అందించారు.
ఈ సందర్భంగా వారు.. వికలాంగ విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారికి సాధికారత కల్పించడానికి తమ బృందం అంకితభావాన్ని ప్రదర్శించిందని తెలిపారు. తాము చేసిన ఈ కృషి వికలాంగ విద్యార్థుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతోందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై దేవార్న్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ.. స్టూడెంట్స్ ఫర్ సేవా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేసి, విద్యార్థుల ప్రగతికి దోహద పడాలని సూచించారు.
Read More..
గంజాయి రవాణా ముఠా సభ్యుల అరెస్ట్..
