- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RBI: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇంద్రనీల్ భట్టాచార్యను నియమించిన ఆర్‌బీఐ

దిశ, బిజినెస్ బ్యూరో: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇంద్రనీల్ భట్టాచార్యను నియమిస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గురువారం వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) హోదాలో ఇంద్రనీ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగానికి బాధ్యతలు నిర్వహిస్తారని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన నియామకం మార్చి 19 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈడీ బాధ్యతల కంటే ముందు ఇంద్రనీల్ భట్టాచార్య ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీలో సలహాదారుగా పనిచేశారు. ఆయన తన మూడు దశాబ్దాల కాలంలో ద్రవ్య, ఆర్థిక విధానం, బ్యాంకింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు వంటి విభాగాల్లో కీలక పదవులను చేపట్టారు. 2009-14 మధ్య ఐదేళ్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్, దోహా, ఖతార్‌లలో గవర్నర్ కార్యాలయంలో ఆర్థిక నిపునులుగా పనిచేశారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఇంద్రనీల్ భట్టాచార్య ఆర్థికశాస్త్రంలో పీజీ డిగ్రీని పొందారు.