- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL-2025: ఆర్సీబీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025(IPL-2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు బోణి కొట్టింది. ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. కోల్‌కతా(Kolkata Knight Riders) నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే ఛేదించింది. మొత్తంగా 16.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి.. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ(RCB) బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్(56), విరాట్ కోహ్లీ(59), రజాత్ పాటిదర్(34), లివింగ్‌స్టోన్(15) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక కేకేఆర్(KKR) బౌలర్లలో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) బ్యాటర్లు కూడా బాగానే రాణించారు. ఒకరిద్దరు మినహా అందరూ పర్వాలేదు అనిపించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు, కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు, రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశారు. దీంతో మొత్తంగా కేకేఆర్ జట్లు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ(RCB) బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా, హేజల్ వుడ్ రెండు, రసిక్ దర్ సలామ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.