ఫస్ట్ డే డ్యూటీ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇంజనీర్ మృతి

by Kalyani |
ఫస్ట్ డే డ్యూటీ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇంజనీర్ మృతి
X

దిశ, గండిపేట్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో యువ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. యువ ఇంజనీర్ నవీన్ చారి మొదటి రోజు ఉద్యోగం చేసి తిరిగి వస్తున్నాడు. కోకాపేట్ టీ గ్రిల్ వద్ద బైక్ పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్ చారి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు చికిత్స నిమిత్తం హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నవీన్ చారి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed