ఐపీఎల్‌లో వాళ్ల పోటీ ఇండియా Vs పాకిస్తాన్ మ్యాచ్ లెక్కే

by John Kora |
ఐపీఎల్‌లో వాళ్ల పోటీ ఇండియా Vs పాకిస్తాన్ మ్యాచ్ లెక్కే
X

- ముంబై, చెన్నైలు చిరకాల ప్రత్యర్థులే

- ఇదొక హై వోల్టేజ్ మ్యాచ్

- మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగేది హై ప్రెజర్, హై వోల్డేట్ మ్యాచ్ అని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ హర్బజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠ ఉంటుందో.. అలాంటిదే సీఎస్కే, ఎంఐ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉంటుందని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్‌లో ఇండియా, పాకిస్తాన్ ఎంతటి ప్రత్యర్థులో.. ఐపీఎల్‌లో చెన్నై, ముంబై జట్లు కూడా అంతే ప్రత్యర్థులని భజ్జీ అన్నాడు. ఈ రెండు జట్ల ఫ్యాన్స్ కూడా దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ జట్ల అభిమానుల్లాగ పోటీ పడతారని చెప్పుకొచ్చాడు. ఎంతో మంది క్రికెటర్లు ఈ రెండు జట్ల కోసం ఆడారు. చెన్నై ఒక అద్భుతమైన, టాప్ జట్టు. దాన్ని ఓడించడం అంటే.. తర్వాతి రోజు ఆ జట్టు హెడ్ లైన్స్‌లో ఉంటుంది. అదే విధంగా ముంబై కూడా గొప్ప జట్టు. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలా ఉత్కంఠత నెలకొని ఉంటుందని జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో హర్భజన్ చెప్పాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా చేయడంపై కూడా హర్షం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌గా మారే వరకు పరాగ్‌ను కెప్టెన్ చేయడం మంచిదే అని అభిప్రాయపడ్డాడు. పరాగ్‌ క్రికెట్ ఎదుగుదలను చాలా కాలంగా గమనిస్తున్నాను. అతను మ్యాచ్‌లనే కాకుండా టోర్నమెంట్‌లను కూడా గెలిపించగలడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో యువ స్పిన్నర్ల ప్రదర్శన ఎలా ఉండబోతోంతో చూడాలనే ఆసక్తిగా ఉందని భజ్జీ అన్నాడు. వాళ్లు ఆట ఆడే సమయంలో ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని తాను గమనిస్తానని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed