- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
India: ప్రపంచానికి వినియోగ రాజధానిగా భారత్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాన ఆర్థికవ్యవస్థలను అధిగమించి ప్రపంచానికే వినియోగ రాజధానిగా భారత్ అవతరిస్తుందని ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ ఏంజెల్ వన్ నివేదిక పేర్కొంది. భారత జీడీపీలో వినియోగం వాటా 56 శాతంగా ఉంది. ముఖ్యంగా మొత్తం ఆర్థికవ్యవస్థలో ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య కారణంగా 2034 నాటికి భారత వినియోగం రెట్టింపు అవుతుందని నివేదిక అభిప్రాయపడింది. దేశంలో చిన్న కుటుంబాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది వినియోగ వృద్ధికి కీలకంగా ఉంటుంది. దేశీయ వినియోగానికే కాకుండా ప్రపంచ శ్రామికశక్తి వృద్ధిలో భారత్ ముందంజలో ఉంది. అంతేకాకుండా వచ్చే 25 ఏళ్లలో భారత్ చేయబోయే పొదుపు గడిచిన పాతికేళ్లలో మొత్తం పొదుపు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. గణాంకాల ప్రకారం, 1997-2023 మధ్య భారత్ చేసిన మొత్తం పొదుపు విలువ 12 ట్రిలియన్ డాలర్ల ఉండగా, 2047 నాటికి 103 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ ఏడాది ప్రకటించిన యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. లక్షల కోట్ల వరకు పన్ను తగ్గింపు ప్రయోజనాలను అందించింది. దీనివల్ల రూ. 3.3 లక్షల కోట్ల వినియోగం పెరుగుతుంది. ఇది దేశ జీడీపీలో 1 శాతానికి సమానం. ఒకప్పుడు ఆర్థిక, ఆదాయ విస్తరణలో భాగంగా అమెరికా, చైనా దేశాలు విచక్షణతో కూడిన వినియోగాన్ని చూశాయి. ప్రస్తుతం భారత్ ఇదే పంథాల్లో నడుస్తోంది. అంతేకాకుందా మొత్త యూఎస్ జనాభా కంటే భారత్‌లో ఎక్కువ జెన్ జీ తరం ఉంది. వీరు 2035 నాటికి ఖర్చు చేసే ప్రతి రెండో రూపాయి ఈ తరం నుంచే వస్తుంది. ఫలితంగా భారత వినియోగ వృద్ధి పటిష్టంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.