- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వరల్డ్ నం.2కు షాకిచ్చిన భారత యువ షట్లర్.. స్విస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సుబ్రమణియన్

దిశ, స్పోర్ట్స్ : స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ ఉమెన్స్ డబుల్స్ టైటిల్ దిశగా వెళ్తున్నది. టోర్నీలో వరుసగా మూడు విజయాన్ని నమోదు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయత్రి జోడీ 21-18, 21-14 తేడాతో హాంకాంగ్ చెందిన యెంగ్ న్గా టింగ్-యెంగ్ పుయ్ లామ్ జంటపై విజయం సాధించింది. 44 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత షట్లర్లు పోరాడి గెలుపొందారు. సెమీస్‌లో గాయత్రి, ట్రీసా జాలీలు కఠిన ప్రత్యర్థులను ఎదుర్కోనున్నారు. టాప్ సీడ్, చైనాకు చెందిన షెంగ్ షు లి-నింగ్ టాన్ ద్వయంతో తలపడనున్నారు. మరోవైపు, యువ షట్లర్ సుబ్రమణియన్ సత్తాచాటుతున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. రెండో రౌండ్‌లో ఏకంగా వరల్డ్ నం.2 అండర్స్ ఆంటోన్సెన్(డెన్మార్క్)ను మట్టికరిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన సుబ్రమణియన్ 18-21, 21-12, 21-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అక్కడ ఫ్రాన్స్ ప్లేయర్ క్రిస్టో పొపొవ్‌ను ఎదుర్కోనున్నాడు. స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.