- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గొడ్డలితో తలపై బాదుకొని, ఆపై ఉరివేసుకొని..
by Sridhar Babu |

X
దిశ,పెగడపల్లి : మద్యానికి బానిసై, మానసిక ఒత్తిడి వల్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కొత్తూరు రాజయ్య తన కుటుంబంతో కలిసి కరీంనగర్ లో నివసిస్తూ అనారోగ్య కారణాలతో మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసయ్యాడు.
దాంతో బుధవారం మధ్యాహ్నం తన సొంత గ్రామానికి వచ్చి రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొడ్డలితో తల మీద బాదుకుని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన బాలే కవిత గమనించి రాజయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజయ్య కుమారుడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులతో చేరుకుని చూసేసరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Next Story