- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kanima Lyrical Video: రెట్రో నుంచి ‘కనిమా’ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సూర్య-పూజల క్యూట్ డ్యాన్స్..

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కంగువ’(Kanguva) మూవీతో మనముందుకు వచ్చి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). దీనికి కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జ్యోతిక(Jyothika), సూర్య నిర్మిస్తున్నారు. ఇక 1980 బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం మే 1న తమిళం, తెలుగులో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్(Songs), టీజర్(Teaser), గ్లింప్స్(Glimps) ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెట్రో నుంచి ‘కనిమా’ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నన్ను నీ ప్రేమలో పడేయ్’ అంటూ సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) స్వరపరిచిన ఈ గీతంలో అదిరిపోయే స్టెప్పులతో సూర్య- పూజల జంట ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి.
Read More..