శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. అసలు విషయం ఇదే!

by Shiva |
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగిన ఘటన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు (Bengaluru)కు వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India) ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం శ్రీనగర్ (Srinagar) నుంచి రన్‌వే పైకి రీచ్ అవ్వలేదు. దీంతో దాదాపు బెంగళూరు (Bengaluru) వెళ్లాల్సిన 150 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లోనే పడిగాపులు కాశారు.

ఫ్లైట్ ఎందుకు లేట్ అయిందని ఎయిరిండియా (Air India) ప్రతినిధులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు శ్రీనగర్ (Srinagar) నుంచి ఫ్లైట్ రాక ముందే బోర్డింగ్ (Boarding) ఎందుకు ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. ఫ్లైట్ లేట్ అని ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా ఎయిర్‌పోర్టు (Airport)లో గంటల తరబడి వెయిట్ చేయించడం ఏంటని ప్రయాణికులు మండిపడ్డారు.

Next Story

Most Viewed